Categories
Gagana

తల్లి పాత్ర కూడా పాత్రే

ఫిదాలో చక్కని డాన్స్ లు చేసిన సాయి పల్లవి మూడో సినిమా కణంలో చిన్న పిల్లకు తల్లి పాత్ర చేసింది. మొదట్లోనే ఇలాంటి పాత్రను ఒప్పుకోవటం వల్ల కెరీర్ కు ఇబ్బంది  రాదా అని అడిగితే ఎందుకు చేయకూడదు అంటోంది సాయి పల్లవి. తల్లి పాత్ర కూడా పాత్రే . ఒక సాధారణ ప్రేక్షకురాలిగా నేను సినిమాలు చూసినప్పుడు పెద్ద హీరోయిన్లు అమ్మ పాత్రల్లో నటించారు. నాకేప్పుడు వారు తల్లి పాత్రలో నటించినప్పుడు డీ గ్లామర్ అని గానీ వారెందుకు ఇలాంటి పాత్రను ఒప్పుకున్నారని అనిపించేలేదు. కథ విన్నప్పుడు నేను అలాంటి పాత్ర చేయగలనా అని ఆలోచించాను కానీ అది తల్లిపాత్ర కదా నేను చేస్తే బావుంటుందా అని అనుమానం నాకు కలుగలేదు అంటోంది సాయిపల్లవి.

Leave a comment