తల్లులు జాబ్ చేస్తే ,స్కూల్ వదిలాకా పిల్లలు వాళ్ళ కంటే ముందే ఇంటికి వచ్చేస్తారు. వంటరిగా తల్లులు వచ్చే వరకు గడపుతారు ఇలాంటి పరిస్థితికి వాళ్ళను ముందే అలవాటు చేయాలి. కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్ నెంబర్లు వారి వద్ద ఉండాలి. అలాగే కొన్నీ హెల్స్ లైన్ నెంబర్స్ కూడా అవసరం అయితే వెంటనే కాంటాక్ట్ చేసే విధంగా పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. తెలియని వారి పట్ల అలర్ట్ గా ఎలా ఉండాలో నేర్పాలి. తెలిసిన,తెలియని వాళ్ల మధ్య ఉండే తేదా పిల్లలు అర్ధం చేసుకొవాలి. వ్యక్తి గత వివరాల్ని ,రాకపోకల సమయాలను పెద్దవాళ్ళు కూడా అందరికీ చెప్పకూడదు. తలుపులు జాగ్రత్తగా వేసుకోవటం ,అపరిచితులు ఫోన్ చేసిన మాట్లాడకుండా ఉండటం వంటి సకల జాగ్రత్తలు పిల్లలకు పెద్దవాళ్లు శ్రద్ధగా చేర్పాలి.

Leave a comment