ఇప్పుడు అత్యంత ఖరీదైన ,అరుదైన ప్లాటినమ్ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మన దేశంలో నగల తయారీకి వాడే ప్లాటినమ్ 95 శాతం స్వచ్ఛమైనది. గని నుంచి తవ్వి తీసినప్పుడు ఎంత తెల్లగా ఉంటుందో నగల తయారీలో కూడా అంతే తెల్లగా ఉంటుంది. సంపద ప్రదర్శించేందుకు ప్లాటినమ్ ను మించింది లేదు. బంగారంతో సహా కొన్నీ లోహాలు కొందరి చర్మతత్వానికి సరిపడవు కానీ  ప్లాటినమ్ తో అలాంటి సమస్య ఉండదు. చెయిన్స్ ,నెక్లెస్ లు అన్నీ షాపుల్లో లభిస్తున్నాయి. ప్లాటినమ్ నగలపైన పిటి 950 అనే ముద్ర ఉంటుంది. అది నాణ్యతకు చిహ్నాం .బంగారం కంటే విలువైన ప్లాటినంకు ఇప్పుడు చాలా డిమాండ్ .

Leave a comment