ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో 10 నుంచి 12 శాతం పిల్లల మానసిక అనారోగ్యాలకు కారణం వారికి సరైన వయసులో మంచి అలవాట్లు నేర్పక పోవటమేనని తేల్చింది. బాల్యంలో పిల్లలు అతిగా కోపం ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శన వెనక కారణాన్ని తల్లిదండ్రులు గుర్తించి అదుపులో ఉంచుకోవటం పిల్లలకు నేర్పాలి అంటున్నారు అధ్యయనకారులు. దుడుకు స్వభావం తగ్గించే రకంగా ధ్యానం క్రీడల్లో ప్రవేశించేలా వారిని ప్రోత్సహించాలి. నిద్రపోవటం నిద్రలేవటం సరైన సమయానికి హోం వర్క్ పూర్తి చేయటం వంటివి అలవాడేలా చేయాలి. చిత్రలేఖనం, మొక్కల పెంపకం వంటివి వారిలో క్రమశిక్షణ పెంచుతాయి.

Leave a comment