Categories
ఏడాది లోపు పిల్లలకు ఇచ్చే ఆహారం వాళ్ల సంపూర్ణ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సాదారణంగా పిల్లలకు అరగదనే అపోహతో వాళ్లకు నీళ్ళు కలిపిన పాలు ఇవ్వటం,ఇతర ఘనాహారం కూడా సరిగా పెట్టక పోవటం చేస్తారు. కాని పాలు సంపూర్ణాహరమని, పిల్లలకు పాలతో పాటు గుడ్లు ,వేరు సెనగ పప్పులు వంటివి తప్పని సరిగా ఇవ్వాలని,అవి శుభ్రంగా అరిగిపోతాయని పైగా వాటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆరు నెలల పిల్లలకు కూడా గుడ్డు తప్పని సరిగా ఇవ్వచ్చునంటున్నారు . మూఢనమ్మకాలతో తల్లులే పిల్లలకు మంచి ఆహారం ఇవ్వకుండా అనారోగ్యాల పాలు చేస్తారని డాక్టర్లు చెపుతున్నారు.