ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తారు.ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి.నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెలు మధ్య పెడితే పురుగులు బెడద ఉండదు.మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటకట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి. పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు  తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజుల తరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి. కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి పట్టు చీరెలు బయటికి తీసి కాసేపు ఎండపొడ వచ్చే ప్రదేశంలో ఆరేసి గతంలో పెట్టిన మడతలు మార్చి పెట్టాలి ఒకే మడతలో ఎక్కువ రోజులు ఉంటే అక్కడ చిరుగులు పడిపోతాయి.మరీ ఖరీదైన జరీ చీరెలు పైటకొంగు లోపలికి మడిచి మడత వేసి తెల్లని వస్త్రం తో చీరెను చుట్టి బీరువాలో పెట్టుకోవాలి

Leave a comment