Categories
చిన్న వయసులో ఏం తిన్నారు అన్నది పెద్దయ్యాక మంచి ప్రభావం చూపిస్తోందని కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో కొవ్వు చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే పెద్దయ్యాక మంచి ఆహారం తిన్న ప్రయోజనం ఉండదంటున్నారు చిన్నతనంలో తీసుకున్న ఆహారం వల్ల ఉదరంలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ల సమ్మేళనం (మైక్రో బియమ్) మారిపోయి వైవిధ్యం తగ్గిపోతుందని అలా మారినది జీవితాంతం ఉండిపోతుందని చెబుతున్నారు. ఈ మైక్రో బియమ్ ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధక శక్తి ఉంటుంది .ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. విటమిన్ ల తయారీకి తోడ్పడుతుంది.