Categories
భవనాల్లో, పని ప్రదేశాల్లో, ఇళ్ళలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూసుకుంటే కోవిడ్ -19 ముప్పు చాలావరకు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు.వైరస్ బయటకి పోయేందుకు గాలి ధారాళంగా వచ్చేలా ఉండటం తోడ్పడుతుంది.శ్వాస వల్ల, దగ్గు వల్ల కరోనా వైరస్ గాలిలోకి కలుస్తుంది. గాలిలో కనీసం 30 నిమిషాలు కరోనా ఉండగలదని అధ్యయనాలు చెప్పాయి.స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో వైరస్ ఎక్కువ సేపు జీవించలేదు గాలి వస్తుంటే కిటికీలు తలుపుల ద్వారా బయటకు వెళ్ళిపో గలుగుతుంది . అందుకే ఏసీ ల కంటే బయట గాలి ఎక్కువగా లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోమంటారు అధ్యయనకారులు.