రాస కట్ల సంధ్య భారత మైనింగ్ రంగంలో అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్. సర్టిఫికెట్ కాంపిటెన్స్ మహిళగా చరిత్ర సృష్టించింది ఇది తెలంగాణ మహిళలు సాధిస్తున్న విజయాల్లో ఒకటి. సింగరేణికి చెందిన ఈ కుమార్తెను చూసి ఎంతో గర్వపడుతున్నా అని ట్వీట్ చేశారు ఎం ఎల్ సి  కల్వకుంట్ల కవిత. సంధ్య కొత్తగూడెంలో బీటెక్ (మైనింగ్) పూర్తి చేసింది.మామూలు ఉద్యోగాలు కాదనుకొని భూగర్భంలో పనిచేసేందుకు కావలసిన దృవీకరణ పత్రాన్ని పొందింది.ఇప్పుడు ఈమెకు భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్ గా పని చేసే అర్హత లభించింది.దేశంలో ఈ అర్హత సాధించిన తొలి అమ్మాయి సంధ్య.

Leave a comment