Categories

కష్ట సమయం వచ్చినపుడు ఎంతో మంది తెలివిగా దాన్ని దాచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులకు ఆదర్శంగా,సాయంగా నిలబడతారు బీహార్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ గీత రాణి అత్యవసర విధులకు హాజరు కావాలి. కానీ ప్రొటెక్షన్ కిట్ లేదు దాంత్తో ఆమె కారు కవర్ తో తనకు,తన భర్తకు ప్రొటెక్షన్ కిట్ లు కుట్టించుకొన్నారు.దాన్ని మళ్ళీమళ్ళీ శుభ్రం చేసి వాడు కోవచ్చునని ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ కు ఇమెయిల్ చేసినట్లు చెపుతున్నారు డాక్టర్ గీత రాణి. ఈ సమయంలో ఎలాటి అంశమైనా ఉపయోగపడితే మంచిదే. కారు కవర్ కూడా రక్షణగా నిలబడింది కదా!