హైదరాబాద్ లో మొదటి బయో బ్యాంక్ ప్రారంభించారు మాలిక్యులర్ జెనెటిక్స్ లో పీహెచ్డీ చేసిన జుగ్ను జైన్. క్యాన్సర్ మొదలు కరోనా వరకు ఎన్నో వ్యాధులు పరిశోధనకు ఈమె ప్రారంభించిన సేపియన్  బయో సైన్సెస్ కీలకంగా పనిచేస్తుంది. ఔషధాల తయారీలో కూడా బయో బ్యాంక్ లది కీలకపాత్ర రోగుల నుంచి లాబరేటరీ ల నుంచి రక్తం, ద్రవాల నమూనాలు సేకరించి భద్ర పరుస్తారు.ఔషధ తయారీ వ్యాధి గుర్తింపు నివారణ చికిత్సలు పైన పరిశోధనలు జరిపే సంస్థలు వీటిని తీసుకుంటారు సేపియన్స్ లు రెండు లక్షల మంది రోగులకు సంబంధించిన 20 లక్షల నమూనాలు ఉన్నాయి. మెరుగైన చికిత్స అందించేందుకు శాస్త్రవేత్తలు వాటి పైన పరిశోధనలు చేస్తారు. మహిళల ఆరోగ్యం దిశగా జుగ్ను జైన్ చేసిన పరిశోధనలకు గానూ ఆమె నీతి అయోగ్,విమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డ్ ను అందుకొన్నారు.

Leave a comment