Categories
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో ఉంది శ్రీ రంగనాథ స్వామి ఆలయం తొండ మాన రాజు ప్రారంభించిన ఈ దేవాలయాన్ని చోళులు పూర్తిచేశారు. 156 ఎకరాల్లో 4,116 కిలోమీటర్ల చుట్టుకొలత తో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం ఈ ఆలయం. 11 అంతస్తులతో, 237 అడుగుల ఎత్తులో ఇక్కడి రాజ గోపురం ఆసియాలోనే పెద్దది. ఆలయ ప్రాంగణం లో 81 దేవతామూర్తుల గదులను విశ్రాంతి గదులను వాణిజ్య సముదాయాలు కలిగిన దేవాలయం. టెంపుల్ టౌన్ గా పిలుస్తారు. గర్భాలయంలో ఉన్న శయన భంగిమలో ఉన్న స్వామిని మరియు పెరుమాళ్ అంటారు. చారిత్రక కాలం నాటి మురుగు నీటి నిర్వహణ వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధానం తో ఈ ఆలయం ఐక్యరాజ్యసమితి అవార్డుని సొంతం చేసుకుంది.