హర్యానా కు చెందిన సంతోషి రేవ్ ఒడిశా లోని కోయిడా మైనింగ్ గనుల నుంచి ఇనుపక్కన ఖనిజాన్ని రవాణా చేసే ట్రక్ నడుపుతోంది. భర్త వదిలేశాక జీవనోపాధి కోసం స్పిన్నింగ్ మిల్లులో పని చేసింది భారీ వాహనాలు నడపడం లో శిక్షణ పొందింది. 2021లో సిటీ బస్సు సర్వీస్ అయినా ‘మో’ బస్సులో డ్రైవర్ గా చేరింది ఆమె తొలి మహిళ బస్ డ్రైవర్ తర్వాత మైనింగ్ కంపెనీ వోల్వా ట్రక్ నడిపే అవకాశం ఇచ్చింది ఇప్పటివరకు ఈ రంగంలో పురుషులే ఇలాంటి ట్రక్కులు నలపేవాళ్లు. 30 ఏళ్ల సంతోషి జీవన పోరాటం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఎందరికో స్ఫూర్తి నిస్తుంది.

Leave a comment