Categories
మహిళలు మరింత ఆరోగ్యంగా శక్తిమంతంగా మారాలంటే ఆహారం చాలా బలవర్ధకం గా ఉండాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మీగడ లేని పెరుగులు శరీరానికి మేలు చేసే ప్రో బ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఎక్కువ పనులు చేసేందుకు ఎముక సామర్థ్యం కావాల కనుక పెరుగు ఎక్కువగా తినాలి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువూకు ఆరోగ్యాన్ని ఇస్తాయి క్రమం తప్పకుండా చేపలు తింటే హైపర్ టెన్షన్ ఒత్తిడికి కీళ్ల నొప్పులు రావు. రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఆకలిని నియంత్రించి తీపి తినాలనే ఆలోచన కూడా తగ్గిస్తాయి. వీటిలోని ఫైటో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ల సమతుల్యనికి ఉపకరిస్తాయి స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.