బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖవర్చస్సు పెరుగుతుంది ముఖం పైన నల్ల మచ్చలు పోతాయి. బొప్పాయి పొడి చర్మం గలవారికి మాయిశ్చరైజర్ లాంటిది. బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత తేడా తెలుస్తుంది.ముల్తానీ మట్టి ముఖం పై ఉండే జిడ్డును తొలిగిస్తుంది. బొప్పాయి మృదుత్వాన్ని ఇస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మొటిమలతో బాధ పడుతున్న వారు ఈ ప్యాక్ ను వేసుకొంటే ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి గుజ్జుతో రెండు స్పూన్ల అలోవెరా జెల్ కలిపి ప్యాక్ వేసుకొంటే జిడ్డు కంట్రోల్ చేయటమే కాక,నల్ల మచ్చలు పోగొడుతుంది.

Leave a comment