Categories
ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించాలంటే కొన్ని మూలికలను తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఆయుర్వేదంలో తులసి ది ప్రధాన పాత్ర ఈ మొక్క ఆకులు కషాయంగా,లేదా టీ గా తాగొచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.అల్లం లేదా శొంఠి కూడా శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి. అలాగే కండరాల నొప్పులను తగ్గించడం తో పాటు గాయాలను మాన్పే గుణం కూడా పసుపుకు ఉంది.కఫాన్ని కరిగించి వెలుపలికి రప్పించే గుణం ఉన్న పసుపును వేడి పాలలో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తులు బలపడతాయి. ఒత్తిడి,ఆందోళన, నిద్రలేమి సమస్యలు పరిష్కరించ గలగా అశ్వగంధీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.