రోజులో ఏదో ఒక కారణంతో  మూడు బావుండక పోవటం సహజమే అలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగుల పదార్థాలు తినటం ఎంతో ఉపయోగం అంటారు ఎక్స్పర్ట్స్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు ప్రతి రోజు తీసుకుంటే ఆశావాదం   సంతోషం ఆత్మస్థైర్యం ఏదైనా తట్టుకోగల గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. అందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే.ఒక చిన్న ఆపిల్ అయినా కొన్ని ద్రాక్ష పండ్లు అయినా సరిపోతాయి.తేలికగా జీర్ణమయ్యే పెరుగు పెరుగన్నం చల్లని ప్లేన్  కస్టర్డ్  చైనా గ్రాస్   జెల్లీ పులుపు లేని పళ్లరసాలు మొదలైన వాటితో జీర్ణశక్తి పెరిగి శరీరం తేలికగా ఉంటుంది.

Leave a comment