Categories
బుట్ట బొమ్మ పాట హిట్ అయినట్లే నాట్యం చేసే బొమ్మల బుట్ట లోలాకులు కూడా ఫ్యాషన్ ప్రపంచంలో మంచి చోటే తీసుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టయిల్ లో భలే డాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు లాకెట్లు, వెండితో చేసినవి కాకుండా ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ లో కూడా డాన్సింగ్ బుట్టలు అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు. సంప్రదాయా వేడుకల్లోనే కాదు క్యాజువల్ గానూ ప్రత్యేక పార్టీల్లోనూ ఎలాటి డ్రెస్ పైన కూడా ఈ డాన్సింగ్ లోలాకులు సరిగ్గ మ్యాచ్ అవుతాయి.