నువ్వు నువ్వు ఎంత చక్కని పాట. ఆ పాటలో సోనాలీ బింద్రే చక్కని అందం అందరికి గుర్తోస్తుంది. ఈ అందమైన సోనాలీకి క్యాన్సర్ అని తెలియగానే అందరికీ చెప్పలేని బాధేసింది.ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకొంటున్న సోనాలీ ట్వీట్టర్ లో తన గురించి తల్లడిల్లిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మనముందు నిలబడుతుంది.ఏదో చిన్న నొప్పి విసిగేస్తు ఉంటే హస్పటల్ లో టెస్ట్ కోసం వెళితే క్యాన్సర్ అని తేలింది.నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. ఈ కష్ట సమయంలో నా కుటుంబం ,స్నేహితులు ,నా అభిమాలు నాకు కావాలసిన వారంత ప్రేమను ధైర్యాన్ని ఇచ్చారు.ఈ బలంతో నేను ప్రతి స్టెప్ లోనూ ఫైట్ చేస్తాను. అందరినీ చూసుకొనే నేను ధైర్యంగా ఉన్నానని ట్విట్టర్ లో చెప్పింది సోనాలీ బింద్రే. ఆమె కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకొందాం.

Leave a comment