Categories
అన్ని వంటల్లోనూ వాడే కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేవగానే బ్రేక్ ఫాస్ట్ కు ముందే కరివేపాకు ఆకుల్ని కొన్ని నోట్లో వేసుకుని నమిలితే జుట్టు రాలడం తగ్గుతుంది. పరిగడుపున కొన్ని ఆకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.తలనొప్పి, తల తిరగడం సమస్యలు పోతాయి .శరీరంలో మలినాలు పోయి బరువు తగ్గుతారు.కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. మార్నింగ్ సిక్ నెస్ కు కరివేపాకు మంచి వైద్యం చర్మానికి అందాన్ని ఇస్తుంది. శరీరంలో ఐరన్ లోపం తలెత్త నివ్వదు.రక్తహీనత తగ్గించటం గుండె ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.