Categories
జమ్మూ కాశ్మీర్ లోని గందర్బల్ జిల్లా బాబా వాయిల్ గ్రామాన్ని డౌరీ ఫ్రీ ఏరియా గా ప్రకటించుకున్నారు ఆ ఊరి పెద్దలు. మా ఊర్లో మేము వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నాం దీనికి మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. అని ఊరి పెద్దలు పత్రం రాసుకొని సంతకాలు చేశారు. 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇవ్వాల్టి యువకులు దానిని పాటిస్తున్నారు. పేదరికం, వరకట్నం కారణంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు కాకపోవటం చూసి ఊరి పెద్దలు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి మంది జనాభా ఉన్నాయి ఈ ఊర్లో కట్నం తీసుకోరు పెళ్లి సింపుల్ గా చేస్తారు. పైగా పెళ్లి ఖర్చులు పెళ్ళికూతురు దుస్తులు అబ్బాయే ఇవ్వాలి ఈ ఒప్పందం పాటించకపోతే ఊర్లో వాళ్ళ ని వెలి వేస్తారు. మసీదుల్లో కి కూడా వాళ్లను అనుమతించరు.