Categories
కూరగాయలు తాజాగా ఉన్న వాటిని గుర్తించాలంటే కొద్ది శ్రద్ద ఉంటే చాలు. వంకాయలు ముడతలు లేకుండా మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు వంకాయి తొడిమ ఆకుపచ్చ రంగులో ఉంటే తాజాగా ఉన్నట్లు అనుకోవచ్చు బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి దుంపల పై నల్లని లేదా ఆకుపచ్చని మచ్చలు ఉండకూడదు ఉల్లిపాయ పై పొరలు తేమ ఉండకూడదు. క్యారెట్లు గట్టిగా తేటగా తాజాగా మంచి ఆకారంలో ఉండాలి. ఎక్కువరోజులు నిల్వ ఉంటే క్యారెట్లు మెత్తగా అయిపోతాయి కాలీఫ్లవర్ ఆకులు ఆకుపచ్చ గా ఉంటే తాజాగా ఉన్నట్లు లెక్క. ఆకుకూరలు తెల్ల మచ్చలు లేకుండా ఉండాలి. అలాగే వాటి కాడలు తేటగా, తాజాగా ఉండాలి .వెళ్లున్న బీట్ రూట్ తీసుకోవాలి దుంప పైన మచ్చలు రంద్రాలు ఉండకూడదు.