Categories
యాంటిక్ గోల్డ్ కోటింగ్ టెర్రికోట్ జ్యువెలరీ లో లేటెస్ట్ డిజైన్ లు రామ్ పరివార్ టెంపుల్ జ్యువెలరీ కాసులు వంటివి కొత్తగా వస్తున్నాయి. సహజాతి రత్నాలు కుందన్ లు అంటించిన ఈ మట్టి నగలు ఎనలేని అందంతో అచ్చం బంగారం నగలకు ధీటుగా ఉన్నాయి ఈ మట్టి నగలు ధరించడం ఇప్పుడు క్రేజ్. పండగైనా ప్రత్యేక సందర్భమైన ఎప్పటికప్పుడు కొత్త ఆభరణం కావాలి అనుకునే వాళ్లకు ఈ ఆభరణాలు మనసు దోచేస్తున్నాయి. లక్ష్మీదేవి బొమ్మలున్న టెంపుల్ జ్యువెలరీ కాసులపేరు పచ్చల హారాలు మామిడి పిందెల నెక్లెస్ లు బంగారు నగల్లాగే మెరిసిపోతున్నాయి. పైగా వన్ గ్రామ్ గోల్డ్ నగల తో వచ్చే అలర్జీలు కూడా ఉండవు.