అనగనగా ఓ సరస్సు అందులో బంగారు వర్ణంలో మెరిసే పువ్వుల్లాంటి గోల్డెన్ జెల్లీ ఫిష్ లు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ ప్రాంతం దీవిలోని పలావో దేశానికి చెందిన ఈల్ మాక్ ఐలాండ్ లో ఈ అందాల సరస్సు ఉంది దీన్ని గోల్డెన్ జల్లి ఫిష్ లేక్ అంటారు. మామూలుగా జెల్లీ ఫిష్ తెల్లగా ఉంటాయి. వీటిని మూన్ జెల్లీ ఫిష్ అంటారు .కానీ ఈ సరస్సులో చేపలు తళతళ బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుంటాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు అన్ని దేశాల నుంచి వస్తుంటారు .సరసు సోర్కెలింగ్ కు ప్రసిద్ధి. అంటే ముక్కుకు సోర్కెల్ అనే ట్యూబ్ తగిలించుకుని ఇందులో హాయిగా ఈత కొడుతూ ఈ జెల్లీఫిష్ ల అందాలు చూడొచ్చు. లక్షల సంఖ్యలో ఉండే ఈ జెల్లీఫిష్ ల మధ్య ఈత కొడితే ఎలాంటి ప్రమాదం రాదు అంటే రాదు. ఇందులో ఉండేవి కేవలం గోల్డెన్ మూన్ జెల్లీ ఫిష్ లు. ఇవి గొడుగు ఆకారంలో పారదర్శకమైన చర్మంతో సున్నితంగా ఉండటంతోపాటు ఎలాంటి హానీ చేయవు. ఇవన్నీ నేరేడుపండు నుంచి చిన్న బిస్కెట్ బంతి ఆకారం వరకు ఉంటాయి .ఈ జెల్లీ ఫిష్ సరసు దాదాపు అర కిలో మీటర్ పొడవు 100 అడుగుల లోతు ఉంటుంది .పన్నెండు వేల సంవత్సరాల క్రితం పర్వదిందీ లేక అంటారు పరిశోధకులు. అందమైన ఈ జెల్లీ ఫిష్ లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే వింత చలనాలు సరస్సు ఉపరితలంపైన వింతైన ఆకృతులు కలిగిస్తూ చూసేందుకు అద్భుతంగా ఉంటాయట.
Categories