చర్మం చలికి పొడిబారుతుంది. రసాయనాలు నిండిన మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీమ్ లు కాకుండా సహజ పదార్థాలు వాడితే మంచిది. పాలు చక్కని క్లెన్సర్ లాగా పనిచేస్తాయి. నిర్జీవంగా ఉన్న చర్మాన్ని లోపలనుంచి శుభ్రం చేసి అందంగా మృదువుగా యవ్వన వంతంగా  చేస్తాయి. పాలు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. అరకప్పు పాలలో అయిదారు చుక్కల చొప్పున నువ్వుల నూనె ఆలివ్ నూనె కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దూది ఉండా మంచి దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఈ మిశ్రమం రెండు మూడు రోజులు వాడుకోవచ్చు.

Leave a comment