Categories
అడవులు అద్భుతంగా ఉంటాయి చెట్లు, పక్షులు, జంతువులు, చెరువులు, జలపాతాలు, పువ్వులతో ఆహ్లాదం కలిగిస్తాయి కానీ భయపెట్టే అడవులు కూడా ఉన్నాయి. మర్రి చెట్ల ను గుర్తు చేసే విశాలంగా ఉండే జాక్ వృక్షాలతో నాచు పరచుకొన్నట్లుగా కనిపించే విస్ట్‌మాన్స్ ఉడ్ అడవి ఇంగ్లాండ్ లోని వెస్ట్ డార్ట్ నది సమీపంలో టూ బ్రిడ్జెస్ దగ్గర ఉంటుంది బ్రిటన్ లో అత్యధికమైన జాక్ చెట్లు ఉండే ప్రాంతం ఇదే. ఊడలు విస్తరించి ఆకాశం కనిపించకుండా సందు లేకుండా పెరిగిన చక్కని చెట్ల నీడలో మొత్తం చీకటిమయం గా ఉంటుంది. చెట్ల ఊడలు కూడా భయంకరమైన ఆకారాలతో భయపెడతాయి. డార్ట్‌మూర్ నేషనల్ పార్క్ లోని ఈ అడవి లోకి వెళ్లాలంటే ధైర్యం సరిపోదు అంటారు సందర్శకులు.