Categories
ఇంట్లో తయారు చేసుకోనే కండిషనర్ లు హెయిర్ మాస్కులు శిరోజాలకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. పెప్పర్ మెంట్ ఆయిల్, గ్రీన్ టీ, టీట్రా ఆయిల్ ,గ్రేప్ సీడ్ ఆయిల్ కీరరసం కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి ఈ స్ప్రే వల్ల ఎన్నో ఫలితాలుంటాయి.పెప్పర్మెంట్ ,గ్రీన్ టీ ఆయిల్స్ తాజా సువాసనలు వెదజల్లుతూ కణాలను ఉద్దీప్తం చేస్తాయి.పెప్పర్మెంట్ మాడులో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.గ్రీన్ టీలో సమృద్దిగా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలటాన్ని అరికట్టి జుట్టు పొడిబార కుండా అడ్డుకుంటాయి. టీట్రా ఆయిల్ చుంద్రును తొలగిస్తంది. గ్రీన్ సీడ్ ఆయిల్ తేమని పట్టివుంచి జుట్టును చిక్కులు లేకుండా ఉంచుతుంది.