అన్న రాజమ్ మల్హోత్రా భారత దేశపు మొట్టమొదటి మహిళ ఐ.ఎ.ఎస్ అధికారి. 1950లో ఆమె సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నంలో పాసై తాను అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లోనే పని చేస్తానని ఎంతో వాదించి విజయం సాధించారు. మహిళ సాధికారతను , ఆరోజుల్లో ఒప్పుకోనే ప్రశ్నేలేదు. ఎంతో పక్ష పాతాన్ని,ఆంక్షలనూ అధికమించి మద్రాస్ లో మొదటి పోస్టింగ్ సాధించారు.ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మహిళ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి వ్యవసాయ పెట్టుబడుల విభాగం ఇన్ ఛార్జిగా ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించారు. మహిళ ఐ.ఎ.ఎస్ అధికారిగా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూ ప్రతి చోట సామర్ధ్యం నిరూపించుకొన్నారు మల్హోత్ర. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పదవి అలంకరించిన తోలి మలయాళా మహిళా .1989 కేంద్రప్రభుత్వం ఆమెకు పద్మవిభూషణ్ ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన 91 ఏళ్ళ వయసులో ఆమె కన్నుమూశారు.