Categories
యాపిల్ ఎంత ఆరోగ్యకరమో దానిపై తోక్క అంతకంటే మంచిది అంటున్నారు పరిశోధకులు. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రిసెర్చులో తోక్కలో పన్నెండు రకాల రసాయన పదార్థాలు కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకొంటాయని తేలింది. ట్రెటర్ పెనాయిడ్స్ గా వ్యవహారించే ఈ పదార్థాలు కాలేయం, పెద్ద పేగు ,రోమ్ము కాన్సర్ లకు సంబంధించిన కణాల పెరుగులదలను అడ్డుకుంటాయట. అంతే కాదు క్యాన్సర్ మృతకణాలను కూడా ఇవి బయటకి పంపిస్తాయి. పండు లోనూ క్యాన్సర్ నిరోధక ఫ్లేవ నాయిడ్ ఫిలోనిక్ ఆమ్లాలు ఉంటాయి కనుక ప్రతి రోజు ఆపిల్ తినమంటున్నారు.