శాస్త్ర సాంకేతిక ఆదర్శప్రాయాలుగా చెప్పుకునే మహిళల జాబితాకు అంతులేదు. అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ డాక్టర్ గా వైద్యరంగంలో ఎంతో కృషి చేశారు. ఒక ప్రమాదంలో ఆమె కంటి చూపు కోల్పోయి,సర్జన్ కావాలనే కల వదులుకోవలసి వచ్చింది. కానీ ఆమె కాలంలో వైద్యం వైద్య కళాశాల ప్రారంభించి ఎంతో మంది బాలికలు వైద్యులుగా మారెందుకు సహాయం చేసింది.