పట్టు ఇష్టమే కానీ భారీగా ఉండే చీరెలు ఆఫీసులకు బావుండవు. సంప్రదాయ వస్త్ర శ్రేణి ని ట్రెండీగా వాడుకోవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు.ఆఫీసు కు కట్టుకోవాలి అనుకుంటే బోర్డర్ లేని చీరె ఎంచుకోవచ్చు.ఇప్పుడు అవి ఫ్యాషన్ కూడా, బోర్డర్ లేకపోయిన చక్కని పనితనం ఉన్న పైట కొంగు కనిపిస్తుంది. అప్పుడు హెవీగా డిజైన్ చేసిన చక్కని బ్లౌజ్ వేసుకుంటె సరిపోతుంది. సింపుల్ గా ఒక్క గొలుసు వేసుకున్న సరిపోతుంది. పరికిణి ఓణిలు కూడా మంచి ఎంపికే. కంచి కాటన్ కూడా బావుంటుంది. ఆఫీస్ కు వేసుకోవాలి అనుకుంటే సింగిల్ బోర్డర్ కాకుండా మల్టీ కలర్ లో తీసుకుంటే బావుంటాయి.

Leave a comment