ఒత్తుగా కనుబొమ్మలు కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. కనుబొమ్మలకు ఉల్లిపాయ రసం రాసి నాలుగైదు గంటలు అలా వదిలేసి గోరు వెచ్చని నీళ్ళలో కడిగేస్తే వత్తుగా పెరుగుతాయి. కొన్ని కొబ్బరి నూనె చుక్కల్ని కను బొమ్మల పై రాసి మసాజ్ చేసి అలా రాత్రంతా వదిలేస్తే మంచిది. ఆముదం కూడా జుట్టు ,కనుబొమ్మలకు కూడా మంచిదే. ఒక చుక్క ఆముదంతో కనుబొమ్మలను మసాజ్ చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో కడిగేయాలి.లావెండర్ ఆయిల్ రోజ్ అయిల్ కూడా కనుబొమ్మలు ఒత్తుగా ఉండేందుకు సాయపడతాయి.

Leave a comment