ఇది అమ్మాయిలను సంతోష పెట్టే ఒక అద్భతమైన అధ్యయనం.టీనేజీ పిల్లలలో నూటికి 90 మంది మొటిమలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మరకలను మిగిల్చే ఆ మొటిమల పూర్తి నివారణ కష్టమే ..ఇక అలాంటి తిప్పలు పడకుండి రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగండి ,కొంత వరకు మొటిమల సమస్య పోతుంది అంటున్నారు అధ్యయనకారులు. ముఖ సౌందర్య పరిరక్షణలో కాఫీ కూడా ఉంటుందని తేలింది. కాఫీ లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి అంటున్నాయి అధ్యయనాలు. ఈ అధ్యయనం ఎంతో సంతోషం ఇచ్చిందనీ ,యుక్త వయసులో వచ్చే మొటిమలను సమస్యను ఇంత తేలికైన మార్గంలో తగ్గించవచ్చునని తేలినందుకు ఈ దారిలో అధ్యయనాలు తీవ్రతరం చేయనున్నమని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment