చదువులో ఒక అడుగు ముందున్న ప్రొఫెషనల్ వృత్తుల్లో అమ్మాయిలకు దక్కే అవకాశాలు తక్కువే అంటారు పెప్సికో కంపెనీ మాజీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ఆమె ఆత్మకథ మై లైఫ్ ఇన్ ఫుల్ లో, సంస్థల్లో రాజకీయాలను అర్థం చేసుకోండి కానీ అందులో కి వెళ్ళకుండా దూరంగా ఉండాలి అంటారు. ప్రతి మహిళకు సంపాదించే హక్కు ఉండాలి అంటారు. తన కోసం తమ పిల్లల కోసం కమ్యూనిటీ కోసం చివరకు సమాజం కోసం మహిళ స్వయం స్వాలంబన సాధించడం అవసరం అంటారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు తొలి మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హోదాలో ప్రఖ్యాత యు.ఎస్ మిలటరీ అకాడమీకి బోధకురాలు గా ఉన్నారు.