నెలసరి సమయంలో చిరాకు అలసట ఒత్తిడి అనిపిస్తాయి సువాసనలతో ఈ ఇబ్బంది నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మానసిక సంబంధిత చికిత్సల్లో ఉపయోగించే జాస్మిన్ పరిమళం, మనసుకు విశ్రాంతినీ, నిద్రనూ ఇస్తుంది. పడుకునే ముందుగా దిండు పై చిలకరిస్తే చాలు డిఫ్యూజర్ క్యాండిల్, ఎండిన పూల రూపాల్లో దొరికే లవెండర్ ను, బెడ్రూంలో ఉంచుకుంటే మనసు తేలిక పడుతుంది. కొన్ని చుక్కల ఆరెంజ్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో వేసి ఇంట్లో ఉంచితే చాలు. ప్రపంచవ్యాప్తంగా పర్ఫ్యూమ్స్ లో ఎక్కువగా ఉపయోగించే గంధపు పరిమళం సేద తీరుస్తుంది. స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కలు వేసుకుంటే మేలు. సిడార్ ఉల్ డిఫ్యూజర్లు ఇంట్లో ఉంచుకుంటే దీని సువాసన ఎంతో హాయ్ నిస్తుంది.

Leave a comment