జైపూర్ కు 60కిలో మీటర్ల దూరంలో ఉన్న సోడా గ్రామసర్పంచ్ చావి రజావత్ ఆంధ్రప్రదేశ్ లోని రిషీవ్యాలీ స్కూల్ లో చదువుకొన్న చావి రజావత్ రాజస్థాన్ లోని తాతగారి ఊరైనా శోడ గ్రామానికి వెళ్ళేది. అక్కడ గ్రామ ప్రజలు నీళ్ళు లేని ఇబ్బందులు ,నీళ్ళలో ఫ్లోరైడ్ అదికమైన అంగవైకాల్యంకు గురవుతున్నా పిల్లలను చూసింది. ఢిల్లీ పూనాలో పై చదువులు చదువుకొని ఈ గ్రామ సేవ చేస్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ చావి కార్స్ స్థానం శోడ గ్రామమే .2010లో ఆ గ్రామానికి సర్పంచ్ అయింది. 24 గంటల విద్యుత్ 90 శాతం మరుగు దోడ్లు, బాలికాభివృద్ది కోసం కాలేజీ ,ఇప్పుడు శోడ గ్రామానికి రజావత్ తిరుగులేని నాయకురాలు.