Categories
Soyagam

ఈ నూనెలు శక్తివంతమైన మాయిశ్చరైజర్లు.

డ్రై గా, సెన్సిటివ్ గా ఉండే చర్మం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇలా ఉండే చర్మానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రక్షణ ఇస్తాయి. మృదువుగా ఉంచేందుకు, తేమ కోల్పోకుండా రక్షించేందుకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కు మించిన సౌందర్య సాధనం ఇంకోటి లేదు. చల్లని వాతావరణంలో విత్తనాల నట్స్ నుంచి తీసే నూనెను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా నూనె తీసే పద్ధతి వల్ల ఈ నూనెల ధర ఎక్కువగానే ఉంటుంది. చాలా కష్టమైన పద్ధతుల్లో తయారయ్యే ఈ నూనెతక్కువ మొత్తంలో ఉత్పత్తి వుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, సువాసనలు ఈ నూనెల్లో పుష్కలంగా వుంటాయి. ఇవి తక్కువ కాలం నిల్వ వుంటాయి కనుక వీలయినంత త్వరగా ఉపయోగించాలి. కొబ్బరి నూనె చర్మానికి తేమ అందిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్ లో తయారైన కొబ్బరి నూనె చర్మానికి రెండింతల మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు చర్మం లోకి ఇంకి ముడతలు మటుమాయం చేయటంతో పాటు చర్మం నునుపుగా అయిపోతుంది. ఈ పద్ధతిలో తయారైన నూనేలన్నీ శక్తివంతమైన మాయిశ్చరైజర్లు.

Leave a comment