బిస్కెట్లు, కేక్స్ ఇష్టపడని పిల్లలుండరు అయిటే వీటికి ఫ్లేవర్ ఇచ్చేందుకు ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొన్ని రకాల కొవ్వుల కారణంగా పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పుతున్నారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్ తో పిల్లల జ్ఞాపక శక్తి నసిస్తుందంటున్నారు. పైగా ఈ బిస్కెట్లు, కేకుల్లో వాడేపిండి పదార్ధాలు, రంగులు చెక్కర కారణంగా వుబకాయం సమస్యను కుడా గుర్తించారు. వీటిని రుచి పోకుండా కొద్ది కాలం పాటు నిల్వ ఉంచేందుకు వాడే రాసాయినాల వల్ల కుడా చాలా ఆరోగ్య సమస్యలు వున్నాయన్నారు. కురగాయల్లో, పండ్ల లాగా కాసిన్ని వెంటనే తినే పద్దతి లేకపోవడం తో నిల్వ వుండే ఈ కేక్స్, బిస్కెట్స్ జోలికి పిల్లలు పోకుండా చుదాలంటున్నారు. ఇంట్లో అప్పటికప్పుడు వేడిగా చేసి పెట్టే పదార్ధాలతోనే పిల్లలు ఆరోగ్యంగా వుంటారంటున్నారు.
Categories