హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా ఉన్న ఎందరో స్త్రీల గాధలు ఏవీ అక్షరబధం కాలేదు. భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ గూగుల్ ఒక చక్కని ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. విమెన్ ఇన్ ఇండియా అన్ హర్ట్ స్టోరీస్ అని గూగుల్ సర్చ్ చేస్తే ఒక అద్భుతమైన స్త్రీలకే సొంతమైన ఒక విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టచ్చు. పురాణాల దగ్గర నుంచి సంగీత నృత్యకళాకారుల దగ్గర నుంచి నాట్య నాటక మండళ్ల దాకా సంఘాలు పొలాలు వెయ్యేళ్ళ నాటి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మిస్ అవ్వద్దు. అన్ హర్ట్ స్టోరీస్ గుండె నిండే కధలన్నీ వినండి.
Categories