Categories
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి కదల లేని పరిస్థితి అందరు ఇంట్లోనే ఉన్న సమయంలో ప్రతి పని పర్ ఫెక్షన్ గా ఉండాలని చిరాకు పడకండి ఇది మంచి దృక్పథమే కానీ ఏమాత్రం తేడా ఉన్న అంగీకరించ లేకపోవటం సమంజనం కాదు అంటారు ఎక్సపర్ట్స్ మన ప్రతి చర్య అందంగా ఉండాలి నిజమే కానీ ఆ ప్రయత్నంలో చిన్నపాటి తేడాలున్న పర్ ఫెక్ట్ గా రాలేదని తలపోయటం చాదస్తం అవుతోంది. కొత్త వాతవరణానికి అలవాటు పడుతున్న సమయం. వైరస్ భయంతో ఇంట్లో కదలకుండా ఉండవలసిన పరిస్థితి. చేసే పనుల్లో ఎన్నో తప్పులు దొర్లు తుంటాయి. అవన్నీ నేర్చుకొనే ప్రాసెస్ లో జరిగే పొరపాట్లు గా సర్థుకుపోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.