ఈ రోజుల్లో ప్రతి వాళ్లనీ వెంటాడే సమస్య ఒత్తిడి యోగా తరగతులకు తప్పకుండా హాజరైతే సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన డాక్టర్ క్రిస్ స్ట్రీటర్ . ఆయన సమర్పించిన ఒక అధ్యయనంలో యాంటీ డిప్రెసెంట్లు వాడినా కూడా కుంగుబాటు నుంచి కోలుకోలేక పోయిన వారు యోగాతో ఆరోగ్యం సాధించారు. శ్వాస పైన దృష్టి కేంద్రీకరించి చేసే యోగ సాధన వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. శారీరకంగా సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది నివేదిక.

Leave a comment