ఉమెన్ ఇన్ ఆడియో బుక్ లో మన దేశం తరఫున సాజిదా ఖాన్ కు చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆడియో ఇంజనీర్ ల విశేషాలతో బ్రిటన్ లోని ఒక సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందించింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆడియో ఇంజనీర్ కి ముఖ్య పాత్ర సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డింగ్ సౌండ్ డిజైన్ చేయాలి. అలాగే ఒక పాట రికార్డ్ చేయాలంటే కొన్ని వందల ట్రాక్స్ వినాలి. మెలోడీ బీట్స్ లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్,  గాయకుడి స్వరం రిథమ్స్ మిక్స్ చేయటం ఇవన్నీ ఆడియో ఇంజనీర్ చేయాలి. హైదరాబాద్ మౌలాలి లో పుట్టి పెరిగిన సాజిదా ఖాన్ ఆడియో ఇంజనీర్ చదివింది. 70 సినిమాలకు పైగా పనిచేసింది. 2015 లో రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డ్ తీసుకుంది. 2018 లో తొలి మహిళ మ్యూజిక్ టెక్నీషియన్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్స్ తీసుకుంది. 2019 లో తెలంగాణ రాష్ట్ర అవార్డు తీసుకున్నది సాజిదా ఖాన్.

Leave a comment