Categories
ఎనిమిది నెలల వయస్సు ఉన్న పిల్లలకు ప్రతిరోజు ఏదైనా కథ చదివి వినిపిస్తూ ఉంటే వాళ్ళకు 18 నెలలు వచ్చే సరికి నలభై శాతం కొత్త పదాలు నేర్చుకొన్నారని అధ్యయనాలు గుర్తించాయి. ఏదీ చదవి వినిపింంచని పిల్లల్లో 16 శాతం పదాలు మాత్రమే నేర్చుకోగలిగారు. రంగు రంగుల బొమ్మలపై పుస్తకాలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండాలన్నమాట. చిన్న వయసులో ఏర్పడ్డ ఆసక్తి చదవటాన్ని ఒక అలవాటుగా పరిచయం చేస్తుందన్నమాట. పిల్లలు క్రమంగా చదివే అలవాటు పెంచుకొంటూ ఉంటే వాళ్ళలో ఆలోచనా శక్తి తెలివి తేటలు పెరుగుతాయి. ప్రతి రోజు ఏదో ఒకటీ చదివి వినిపించటం దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెపుతున్నాయి అధ్యయనాలు.