Categories
ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకున్న ఇబా మలై 2016 లో కినిహో పేరుతో ఒక ఏకో బ్రాండ్ ప్రారంభించింది మేఘాలయ లోని రిబోయ్ జిల్లా వుమ్డెన్ అన్న పల్లెలో పుట్టిన ఇబా తన ఊరి వాళ్లకు పట్టుపురుగుల పెంపకం లో ప్రోత్సహించింది ఇక్కడి గిరిజన తెగలు తయారు చేసే పట్టుని వన్య పట్టు లేదా అహింసా పట్టు అంటున్నారు. పట్టుపురుగులను చంపకుండా తీసే ఈ పట్టు ఎంతో మెత్తగా బరువుగా ఉంటుంది. ఈ తయారుచేసే ఏకో ఫ్యాషన్ వేర్ ఆధునికులకు ఎంతగానో నచ్చింది. ఈ పట్టును ఎరీ పట్టు లేదా ఎరీ సిల్క్ అంటారు.