Categories
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అక్కడి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు మసూమా రిజ్వీ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన మసూమా పురాతన కట్టడాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ లు ఎన్నో చేపట్టారు. రాష్ట్రపతి భవన్ మానెక్షా సెంటర్, దీన్ దయాల్ మ్యూజియం వంటివి ఆమెకు పేరు తెచ్చాయి ఇప్పుడీ విమానాశ్రయం తో బాల్యం నుంచి అయోధ్య చేరేవరకు రాముడి జీవిత ప్రయాణాన్ని కలంకారీ పట చిత్ర రాజా రవి వర్మ చిత్రాల ద్వారా తీసుకువచ్చారు దేశవ్యాప్తంగా 100 మంది కళాకారులు ఈ ప్రాజెక్ట్ కు పని చేశారు. శ్రీ రామ కథ భావితరాలకు అందాలన్నదే మసూమా రిజ్వీ ఆశయం. దేశంలోనే ప్రముఖ డిజైనర్స్ లో ఒకరిగానే కాదు, ఆసియాలోనే ఉత్తమ క్యూరేటర్ల లో ఒకరు గా గుర్తింపు పొందారు మసూమా రిజ్వీ.