పల్లవీ రవీంద్రన్ చిన్న తనం నుంచే పైలట్ కావాలను కొంటుంది. ఆమె గోవింద్ బాలకృష్ణన్ ను ప్రేమిస్తుంది. ముంబైలో పైలట్ శిక్షణ కేంద్రంలో ఆమెకు ప్రవేశం లభిస్తుంది. గోవింద్ కు ఆమె స్వేచ్ఛగా ఉండటం మొదటి నుంచి ఇష్టం ఉండదు. ఆమె ఆధునికంగా తయారవటం కూడా సహించలేకపోతాడు. ఆమె వినిపించకోకపోవటంతో మొహం పై యాసిడ్ పోస్తాడు. విషయం కోర్టుకు పోతుంది. గోవింద్ విషయంలో ఏ ఆధారాలు దొరక్క అతన్ని విడుదల చేస్తారు. ఆ యాసిడ్ దాడితో పల్లవి మొహం వికృతమై కంటి చూపు దెబ్బతిని ఆమె పైలట్ లైసన్స్ రద్దయిపోతుంది కానీ స్నేహితుడు విశాల్ ఆమెను ఎయిర్ హోస్టెస్ గా సిఫార్స్ చేస్తాడు. ఒకానొక సమయంలో ఒక విమానం కంట్రోల్ తప్పినప్పుడు ఎయిర్ హోస్టెస్ గా ఉన్న పల్లవి ప్రయాణికులను సురక్షితంగా తీసుకురాగలుగుతుంది .జీవితంలో పై ఎత్తుకు ఎగరాలన్న కోరిక ఉన్న ఒక అమ్మాయి కథ తప్పని సరిగా చూడ దగ్గ సినిమా.