సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న వాదోప వాదాలు చోటు చేసుకొంటూ ఉంటే వాళ్ళకి సర్ధుకు పొమ్మని సలహా ఇస్తారు. లేదా ఎవరో ఒకరు మౌనంగా ఉంటే కాసేపటికి ఆ సమస్య సర్దుమణుగుతోంది అంటూ ఉంటారు. కానీ కొన్నీ విషయాల్లో భర్తల వాదనతో మంచివే అంటున్నారు మానసిక శాస్త్ర వేత్తలు. ఆర్థిక విషయంలో శృంగార విషయాల్లో వాదనలు వస్తే ఇద్దరూ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ విషయం గురించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడుకోంటారు. ఈ వాదనలు లేక పోతే గొడవ ఏక పక్షం అయిపోతుంది. ఇక మెరుగుదలకు అవకాశం ఉండదు. వాదనలు జరిగితేనే చర్చించి సర్దుకుకొనే అవకాశం కలుగుతోంది అంటారు. అలా అనుకొని ప్రతి విషయంలో వాదులాడుకొంటూ కూర్చుంటే అనుబంధం కాస్త మాయమై పోతుంది గుర్తించుకొండి అంటున్నారు.

Leave a comment