శీతకాలంలో చండ్రు సమస్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చుండ్రుతో జుట్టు రాలిపోవడం తో సమస్య మరింత బాధ కలిగిస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె,నిమ్మరసం జుట్టుకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు అంది నిమ్మరసం చుండ్రు చికిత్సలా పనిచేసి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మెంతు పిండి ప్యాక్ చాలా ఉపయోగం. పుల్లటి పెరుగు తలకి పట్టించి కాసేపాగి స్నానం చేసినా మంచిదే.మాడు పైన టిట్రీ ఆయిల్ కొన్ని చుక్కలు స్ప్రెడ్ చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసిన ఫలితం ఉంటుంది. వేపలో యాంటి బ్యాక్టిరియల్ గుణాలు ఉంటాయి. ఆరెంజ్ తొక్కలు నిమ్మరసం కలిపి గ్రైండింగ్ చేసి తలకు ప్యాక్ లాగా వేసినా సమస్య తగ్గుముఖం పడుతుంది.

Leave a comment