Categories
నాగరిక ప్రపంచంలో ఫ్యాషన్ పుట్టుక అనుకుంటాం కానీ సౌందర్య కాంక్ష మనిషి స్వభావంలోనే ఉంది.లడక్ కొండ ప్రాంతంలోని డ్రోక్పా తెగల్లో మహిళలు ధరించే దుస్తులు వాళ్ళ ఫ్యాషన్స్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.డ్రోక్పా అంటే ఆర్యన్ లు అని అర్ధం.హిమాలయాల్లోని డహ్ వ్యాలీలో నివాసం ఉండే డ్రోక్పా స్త్రీలు అలంకరించుకునే విధానం చాలా కొత్తగా ఉంటుంది.అందమైన వెండి నగలు రంగుల దుస్తులు పూసలు,పువ్వులు,గవ్వలతో ఆ అలంకరణలు అద్భుతం.ఇక్కడ వయసుతో ఆడ,మగ తేడాలతో సంభందం ఏమి లేదు.అందరు అందంగా అలంకరించుకుంటారు.ఈ గిరిజన తెగలు స్వేచ్చా విహంగాలు అంటారు.