ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి కారా గౌచర్. ఇప్పటికే రెండు ఒలంపిక్స్ లో పాల్గొన్నారామె. అథ్లెట్లు ఒలంపిక్ విజేతలు అన్న తారతమ్యం లేకుండా అందరూ వేధింపులకు గురైనవారేనని తేలింది కదా ఇంకా మీరేవళ్ళు ఆకతాయిల అల్లరికి భయపడకండి హాయిగా మీ పనులు చేసుకోండి అని ఆడ పిల్లలకు హితవు చెపుతున్నారు ఈ అధ్యయనకారులు.
Categories